తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ఆదివారం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధా తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.