తిరుమల శ్రీవారిని నూతన దంపతులు పీవీ సింధు, వెంకట దత్త సాయి దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఈ జంటకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.