తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ లోని వినాయక ఆలయంలో శనివారం రాత్రి చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో హుండీ నుంచి నగదు ఎత్తుకెళ్లారు. హుండీలను పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద వదిలేసి వెళ్లారు. స్థానికులు ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు.