తనపై కొందరు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు రాస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల విషయాల్లో నిరాధార వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే బాధితుల్లో 31మందికి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. మిగతా 28 మందికి మంగళవారం లోగా పంపిణీ చేస్తామన్నారు.