తిరుపతి జిల్లా పాకాలలో ఓ వ్యక్తి అడవి పందుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. అయితే పాకాలకు చెందిన ఉమర్ ఫరూక్ మే 3న ఓ కేసులో పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. ఈ క్రమంలో పంటపల్లి సమీపంలో రైతు మనోహర్ రెడ్డి పొలంలో వేసిన కరెంట్ వైర్లు తగిలి మృతి చెందాడు. దీంతో రైతు ఉమర్‌ను పాతిపెట్టాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తు చేపట్టారు.