వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చట్టానికి లోబడి పనిచేస్తున్నామన్న తిరుపతి ఎస్పీ.. రాజకీయ విమర్శలను పట్టించుకోమని చెప్పారు. తనపై నమ్మకంతోనే తిరుపతి జిల్లాకు ఎస్పీగా ప్రభుత్వం నియమించిందన్నారు. మంచి ఆశయంతో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనదీ రాయలసీమ జిల్లానేనన్న ఆయన.. అనంతపురం జిల్లాగా చెప్పారు. చట్టపరంగానే పనిచేస్తున్నానన్న తిరుపతి ఎస్పీ .. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.