తిరుపతి నగరంలో రోడ్ల పక్కన, వీధుల్లో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత సిబ్బందిపైన, చెత్త వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది విధులపై శుక్రవారం సాయంత్రం కచ్చపి ఆడిటోరియం లో శానిటరీ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు.