తిరుచానూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణం
తిరుచానూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ ఏవో వెంకటరమణపై విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్, ఏవో మాట్లాడుతుండగా వెనక నుంచి దాడి చేయడం తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణను రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రిన్సిపల్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏవోకు, విద్యార్థికి మధ్య గొడవలు జరిగాయా అన్నది ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.