Feb 15, 2025, 10:02 IST/
పౌల్ట్రీ రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Feb 15, 2025, 10:02 IST
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీనితో తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రైతులు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత పౌల్ట్రీ రైతుల్ని ఆదుకుంటామని.. కోడికి రూ.140 ఇచ్చేందుకు ప్రతిపాదన ఉందంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తాజాగా ప్రకటించారు. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోగా, వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడంపై పౌల్ట్రీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.