ప్రేమ జంట వ్యవహారంలో ఇరు కుటుంబాల ఘర్షణ.. కార్లు ధ్వంసం

78చూసినవారు
AP: కృష్ణా జిల్లా తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరుకు చెందిన యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. యువకుని వద్ద ఉంటున్న యువతిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఆరు కార్లలో వచ్చారు. ‘మా కుమార్తెను అప్పగించాలి’ అని గొడవ పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో యువతి తరపున వచ్చిన వారి నాలుగు కార్లు ధ్వంసం కాగా, రెండు కార్లతో తప్పించుకున్నారు. ఆమెకు అంతకు ముందు వివాహమైనట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్