పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందన్నారు. పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని పేర్కొన్నారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేం.. కాంట్రాక్టర్లను తప్పించేసి పనులు ఆపేయడం ఈ ప్రభుత్వ విధానం కాదన్నారు. ఏపీలో ఈవీ వెహికల్స్‌ను ప్రొత్సహించాలని సూచించారు.