విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాల్లో మెకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితుల ఫిర్యాదులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.