AP: బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పింఛన్ ఇవ్వడానికి ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లిన చంద్రబాబు చిన్నారులతో మాటలు కలిపారు. అయితే చంద్రబాబు మాటలు విని ఓ చిన్నారి ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.