భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో తిలక్ వర్మ (72*), రవి బిష్ణోయ్ (9*) చివరి వరకు క్రీజులో నిలబడి భారత్‌కు విజయాన్ని అందించారు. 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన టీమిండియా బ్యాటర్లు మొత్తం విఫలమవగా తిలక్ వర్మ ఒక్కడే రాణించాడు. అయితే చివర్లో రవి బిష్ణోయ్ ఐదు బంతుల్లో రెండు బౌండరీలు బాదడంతో జట్టు విజయం సులువైంది. భారత్ విజయానికి ఆ రెండు షాట్లే కీలకంగా మారాయని మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ వెల్లడించాడు.