.AP: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాడికొండ మండలం పొన్నెకల్లులో ఓ చిన్న కిరాణా దుకాణం వద్ద సీఎం చంద్రబాబు ఒక్కసారిగా తన కాన్వాయ్ ను ఆపారు. అక్కడ ఉన్న మహిళతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ మహిళ కుటుంబం, జీవనోపాధి గురించి ఆరా తీసి వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.