ప్రాణాంతక రేబీస్ వ్యాధి సోకకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయ మార్గం. కుక్క కాటుకు గురైన కుక్క కరిచిన మొదటి రోజు నుంచి 3, 7, 14, 28, 90వ రోజుల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, పశుసంవర్ధకశాఖ సహకారంతో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు టీకాలు వేయిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది.