ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. నేటి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై పోలవరం నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయి.. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కొత్త రుణాలపై చర్చించనున్నారు. అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సైతం సమావేశం కానున్నారు.