AP: అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి కలిసింది. దీంతో ఆమెకు సీఎం అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.