బోర్డు పరీక్షల్లో విద్యార్థులకు టీచరమ్మ సాయం

79చూసినవారు
బోర్డు పరీక్షల్లో విద్యార్థులకు టీచరమ్మ సాయం
బోర్డు ఎగ్జామ్స్‌లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన ఓ ఉపాధ్యాయురాలిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. బేతుల్ జిల్లాలోని ఓ పాఠశాలలో 5వ తరగతి బోర్డ్ పరీక్షలు నిర్వహించారు. లెక్కల పరీక్ష జరుగుతున్న సమయంలో సంగీతావిశ్వకర్మ అనే టీచర్ బోర్డుపై జవాబులు రాసి విద్యార్థులు వాటిని ఎక్కించుకోవడానికి సాయం చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్