ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలోకి 7 గ్రహాలు (వీడియో)

55చూసినవారు
మరికొద్ది సేపట్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు ఒకే వరుసలోకి రానున్నాయి. సప్తగ్రహ కూటమిలో భాగంగా బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్‌ ఒకే వరుసలోకి చేరుకోనున్నాయి. వీటిలో నెప్ట్యూన్, యురేనస్‌లను టెలిస్కోపుతో మాత్రమే చూడగలమని.. మిగతావాటిని నేరుగా చూడవచ్చని 'నాసా' వెల్లడించింది. కాగా, దీనిపై రూపొందించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్