సీఎం జగన్ హెల్త్ అప్‌డేట్

1084చూసినవారు
సీఎం జగన్ హెల్త్ అప్‌డేట్
సీఎం జగన్‌కు చికిత్స చేసిన వైద్యులు హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. చికిత్స పూర్తయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఎడమ కనుబొమ్మపై మూడు కుట్లు వేసినట్లు తెలిపారు. ట్రయాంగిల్ షేప్‌లో ఒక సెంటీ మీటర్ లోతు వరకు గాయమైందని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదం లేదని, మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్