AP: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో ఆయన పాల్గొని, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చడమే కాకుండా స్వయంగా సీఎం పాల్గొనడంతో భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.