నీటి ప్రవాహం అధికం కావడం, టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దానివల్ల 90 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల నీళ్లు విడుదలయ్యాయి. దిగువకు భారీగా నీళ్లు విడుదల కావడంతో మంత్రాలయం, కౌతాళం, సి. బెళగల్, కోసిగి, నందవరం, తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. నది కాలువలోకి దిగనివ్వకుండా, చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.