హాస్య నటుడు బ్రహ్మానందం నంద్యాలలో సందడి చేశారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్.డి.ఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఆయనకు ఘనస్వాగతం పలికింది. పల్లకిపై పట్టణంలోని అన్ని వీధుల్లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ ఘనంగా సత్కారం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పాల్గొన్నారు.