ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న మారథాన్ ర‌న్న‌ర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

53చూసినవారు
ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న మారథాన్ ర‌న్న‌ర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ ఉగాండా మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ పై ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో 75% కాలిపోయిన రెబెక్కాను స్థానికులు కెన్యాలోని ఆసుపత్రిలో చేర్చారు. రెబెక్కాకు ఆమె ప్రియుడు డిక్సన్ మారంగాచ్ నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మంటలు అంటుకుని మారంగాచ్ కు కూడా గాయాలయ్యాయని చెప్పారు. పిల్లల తల్లి అయిన 33 ఏళ్ల రెబెక్కా కొద్ది రోజులుగా మారంగాచ్‌తో సహజీవనం చేస్తోంది.

సంబంధిత పోస్ట్