2 నెలల పిల్లాడిని చంపిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (వీడియో)

72చూసినవారు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాశ్చా నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ హత్య చేశారు. కానిస్టేబుల్ బాలాజీపై గతంలో కేసు నమోదు కాగా.. ఆ కేసు నిమిత్తం ఏలూరు కోర్టుకు హాజరయ్యాడు. అక్కడే కానిస్టేబుల్ తన భార్య, మామపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికి వచ్చి మరదలిని, అత్తపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో మరదలి రెండు నెలల పసిబాబును పీక నులిమి చంపేశాడు.

సంబంధిత పోస్ట్