కూరగాయల మార్కెట్‌లో చితక్కొట్టుకున్నారు (వీడియో)

1061చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఎదురెదురు పడిన టీడీపీ, వైసీపీ శ్రేణులు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె కూరగాయల మార్కెట్‌లో జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీడీపీ, వైసీపీ శ్రేణులు బనగానపల్లె కూరగాయల మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు ఎదురు పడ్డారు. కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్