AP: తాడేపల్లి పెద్దలతో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు. భోగాపురం మండలంలో రూ.2 వేల కోట్ల భూకుంభకోణం చేశారన్నారు. "సీఎం జగన్ అండతోనే సీఎస్ భూకుంభకోణానికి పాల్పడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాం. సీఎస్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలి." అని ఉమా డిమాండ్ చేశారు.