ఫామ్ కోల్పోయిన పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న కమ్రాన్ గులామ్ అదరగొట్టారు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ(118) చేశారు. దీంతో అరంగేట్ర మ్యాచ్ లోనే శతకం బాదిన సెకండ్ ఓల్డెస్ట్ పాక్ ప్లేయర్ గా నిలిచారు. అబిద్ అలీ 32ఏళ్ల 56రోజుల వయసులో సెంచరీ చేయగా, గులామ్ 29ఏళ్ల 5రోజుల వయసులో ఈ ఘనత సాధించారు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ స్కోర్ 259/5.