విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని అన్నారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని స్పష్టం చేశారు.