AP: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు శుభవార్త చెప్పారు. 'రైతులు నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. అలాగే వాట్సప్ ద్వారా ధాన్యం అమ్ముకునే అవకాశం ఇచ్చాం. వాట్సప్ ద్వారా 16 వేల మంది రైతులు ధాన్యం విక్రయించారన్నారు. రైతుల నుంచి ఎక్కడిక్కడ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. ఆర్థిక కష్టాలున్నా రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని' మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.