HCU వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్

59చూసినవారు
HCU వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్
HCU భూముల వేలం తక్షణమే ఆపాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ 'X' వేదికగా మద్దతు తెలిపారు. ‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ప్రకృతిని నాశనం చేయడానికి పూనుకోవడం, అడ్డొచ్చిన విద్యార్థులను హింసించడం సరైంది కాదు. ఇలాంటి దారుణమైన చర్యకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాను. మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్