AP: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. ‘నా ప్రాధాన్యతను పార్టీలో ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడం లేదు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశాను.’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.