దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన తాజా చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. తాజాగా ఈ చిత్రబృందాన్ని రామ్ చరణ్ దంపతులు అభినందించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. గురువారం (జనవరి 23) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.