వడగాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

73చూసినవారు
వడగాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు వడగాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపనున్నట్లు తెలిపింది. ఈ మెసేజ్ మీ ఫోన్‌కు వచ్చినప్పుడు ఓకే బటన్ నొక్కాలని, ఓకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగుతుందని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఎండకు దూరంగా ఉండాలని, ఎండకు బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్