జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో నిన్న భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో జుతానాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇవాళ ఉదయం నుంచి అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.