TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పిల్లలు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలతో తల్లి రజిత నిన్న రాత్రి అన్నంలో విషం కలిపి ఇవ్వడంతో చిన్నారులు సాయక్రిష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) నిద్రలోనే చనిపోయారు. రజిత అపస్మారక స్థితిలో పడిఉండగా భర్త ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.