IPL-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఐదు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో SRH బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి 28 బంతుల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. దీంతో పెవిలియన్ మెట్లపై ఆగ్రహంతో హెల్మెంట్‌ను విసిరికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.