ముగ్గురు ఐపీఎస్‌లపై క్రమశిక్షణ చర్యలు

81చూసినవారు
ముగ్గురు ఐపీఎస్‌లపై క్రమశిక్షణ చర్యలు
AP: పోలింగ్ నేప‌థ్యంలో రాష్ట్రంలో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు బాధ్యుల్ని చేస్తూ అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్, బిందు మాధవ్‌ల‌ను ఈసీ సస్పెండ్ చేసింది. అలాగే తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌పై బ‌దిలీ వేటు వేసింది. తాజాగా వీరు ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. వీరిపై అభియోగాలు నమోదు చేసి.. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్