ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి పార్థసారథి

57చూసినవారు
ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి పార్థసారథి
AP: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMPY) కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్