మునగాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధికంగా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది. మెనోపాజ్ సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. నెలసరి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎక్కువగా మహిళలలో వచ్చే హార్మోన్ల సమస్యలకు మునగాకు మంచి ఔషధం.