రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

2277చూసినవారు
రోజా ఆస్తులు ఎంతో తెలుసా?
ఏపీ నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే.రోజా ఆస్తులు ఐదేళ్లలో 47 శాతం పెరిగాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2019లో రూ.9.3 కోట్ల ఆస్తులు ఉండగా, ఇప్పుడు రూ.13.7 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు రూ.5.9 కోట్లు, స్థిరాస్తులు రూ.7.8 కోట్లని తెలిపారు. రూ.కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు.

సంబంధిత పోస్ట్