ఏపీలో ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన

76చూసినవారు
ఏపీలో ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు? ఏ పని చేస్తున్నారు? వారి నైపుణ్యాలేంటి? అనే వివరాలను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్‌లైన్‌లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్