ఏపీలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గురువారం వరకు దాదాపు 5 లక్షల ఓట్లు పోల్ కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2.38 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. 6 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఉద్యోగులు, టీచర్లు ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతమనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.