కూటమి విజయంపై అనుమనాలు: వైసీపీ ఎమ్మెల్యే

66చూసినవారు
కూటమి విజయంపై అనుమనాలు: వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై అవిశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వారు నడుచుకున్నారని విమర్శించారు. అటు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు, టికెట్ ఇచ్చిన జగన్‌కు రుణపడి ఉంటానని చంద్రశేఖర్ అన్నారు.

సంబంధిత పోస్ట్