దోమడ లో ' దేవర ' విజయోత్సవ సంబరాలు

57చూసినవారు
దోమడ లో ' దేవర ' విజయోత్సవ సంబరాలు
పెదపూడి మండలంలోని దోమడ గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "దేవర" సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముదపాక వాసు, బండారు నారాయణరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముదపాక వాసు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేసి, బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో బండారు కొండలరావు, సురేష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్