జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామ శివారున నిర్వహిస్తున్న సారా బట్టీపై మంగళవారం తెల్లవారుజామున జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న బోయిన వీర్రాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.