కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గురువారం ఉదయం జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశంలో తోట జగన్నాథం అధికార ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మనుషులు అంతా ఒక్కటేనని కాని కుల మతాలు కారణంగా విడిపోయి మానవత్వాన్ని మరిచిపోతున్నారని ఆయన వివరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలును పరిరక్షించి దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలని దీనికి మనుషులు అంతా ఏకం కావాలని కోరారు.