ఉద్యోగులు జవాబుదారీతనంతో ఉండాలి: ఎంకే మీనా

69చూసినవారు
ఇసుక ర్యాంపుల వద్ద విధులు నిర్వహించే ఉద్యోగులు నిబద్ధత, జవాబుదారీతనంతో ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. గురువారం కొవ్వూరు మండలంలోని పెండ్యాల, రావులపాడు ఇసుక స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించారు. అనంతరం లిక్కర్ గోదాంను తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ ఉన్నారు.

సంబంధిత పోస్ట్