10 నుంచి నీటి సరఫరా నిలుపుదల

57చూసినవారు
10 నుంచి నీటి సరఫరా నిలుపుదల
పంట కాలువలకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నీటిని నిలుపుదల చేయనున్నట్లు ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజినీర్ ఆర్. సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి తూర్పు, మధ్య, ప్రధాన కాలువల పరిధిలో వరి పంట, తాగు నీటి అవసరాలు తుది దశకు చేరుకోవడంతో నీటిని నిలుపుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.